నిర్మానుష్యంగా మారిన హైదరాబాద్ రోడ్లు!

  • పల్లెబాట పట్టిన నగరవాసులు
  • బంధుమిత్రుల మధ్య సంక్రాంతి వేడుకలు
  • ఖాళీ అయిన హైదరాబాద్
లక్షలాది వాహనాలతో అనునిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు బోసి పోయాయి. కొన్ని చోట్ల కర్ఫ్యూను తలపిస్తున్నాయి. అతి తక్కువ సంఖ్యలోనే వాహనాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగను సొంత ఊర్లలో, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకునేందుకు జనాలంతా పల్లెబాట పట్టడంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తమ బిజీ షెడ్యూల్ కు ముగింపు పలికిన నగరవాసులు, భారీ సంఖ్యలో ఊర్లకు తరలివెళ్లారు. నగరంలోనే మిగిలిపోయినవారు కార్యాలయాలకు సెలవులు ఉండటంతో... ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏదైనా పని ఉంటే తప్ప జనాలు రోడ్లపైకి రావడం లేదు. 
Go Back to Shorts
Hyderabad
sankranthi

More Telugu News